28న అకౌంట్లలోకి రూ.13,000 భారీగా ఏర్పాట్లు

సీఎం జగన్‌ ఈనెల 28న పార్వతీపురం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు

జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల చొప్పున జమచేయనున్నారు.

జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జగన్‌ వస్తుండటంతో భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అధికారులు సభాస్థలం, హెలీప్యాడ్‌ ప్రాంతాలను పరిశీలించారు.

వారికి మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, సీఎం కార్యక్రమాల సమన్వయ అధికారి రఘురాం పలు సూచనలు చేసారు