Advertisement
APPSC Group 1 Group 2 Notification: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నిరుద్యోగులకు తీపి కబురు వినిపించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న వందలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
Please complete the article to understand actual information
దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రెవెన్యూ, రవాణా, వాణిజ్యం, అటవీ, మున్సిపాలిటీలు, దేవాదాయం, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, ఎక్సైజ్, ఆర్థికం.. వంటి శాఖల్లో ఉన్న వేర్వేరు హోదాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఖాళీలు ఉన్నాయి. సుమారుగా వెయ్యి వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది.
Advertisement
గ్రూప్ 1కు సంబంధించి సుమారు 100కు పైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్ 2లో 900కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తంగా 1000కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ చేపడతామని అన్నారు.
Advertisement
- 10వ తరగతి అర్హతతో తెలంగాణ జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలు
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
- 10th & ITI అర్హతతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ ఉద్యోగాలు
గ్రూప్ 1 కేటగిరీలో రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవీఓ ఖాళీలు ఉంటాయి. గ్రూప్ 2 కేటగిరీలో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్- రిజిస్ట్రార్లు, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ ఆఫీసర్ల ఖాళీలు ఉంటాయి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాటిని భర్తీ చేయనుంది జగన్ ప్రభుత్వం.
Please complete the article to understand actual information
వీటితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన చర్యలను చేపట్టింది జగన్ ప్రభుత్వం. మొత్తం 2,020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 220 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే- 1,199 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులనూ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఈ ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ రాగానే ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.(మీకు ఈ వెబ్సైటు లో వున్నా నోటిఫికేషన్ సమాచారం నచ్చితే అందరికి share చేయండి )
Advertisement