Advertisement
Ysr Sunna Vaddi Scheme ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెల 10న సున్నా వడ్డీ నిధుల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి గత నెలలోనే విడుదల చేయాల్సి ఉంది.. కానీ అకాల వర్షాల కారణంగా వాయిదా వేశారు. పొదుపు సంఘాల మహిళలకు.. సకాలంలో వడ్డీ చెల్లించేవారికి వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.
Ap Dwacra Woman Sunna Vaddi Funds
ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగస్టు 10న మరో విడత అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖతో పాటుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సున్నా వడ్డీపై ప్రకటన చేశారు.
జులై 26న జరగాల్సిన ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వం డబ్బుల్ని జమ చేస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు.
Advertisement
వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా.. ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. అంతేకాదు అవసరమైన వారికి అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని పెంపొందించే మార్గాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. వాస్తవానికి సున్నా వడ్డీ పథకం నిధుల్ని గత నెలలోనే విడుదల చేయాల్సి ఉంది.. కానీ భారీ వర్షాలు కురువడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.. ఆగస్టు 10న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు.
Advertisement
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల తరహాలోనే పట్టణాల్లోనూ వైఎస్సార్ డిజిటల్ లైబరీల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటు జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని సూచించారు. కాలనీల్లో ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నందున మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడొద్దన్నారు.. ముఖ్యంగా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం.
Advertisement